/rtv/media/media_files/2025/02/25/W7NfTP2qHNvtZI58zEFP.jpg)
Secunderabad Railway Station
సికింద్రాబాద్ స్టేషన్‌ను అభివృద్ధి చేసే క్రమంలో మొత్తం ఆరు ఫ్లాట్‌ఫామ్‌లను మూసి వేశారు. ఈ ఫ్లాట్‌ఫామ్‌లకు వచ్చే రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లించారు. అయితే మొత్తం100 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్‌లను మూసి వేస్తున్నారు. ప్రయాణికులు రైలు వివరాలను ముందుగా తెలుసుకుని వెళ్లాలని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేత
— Telangana Awaaz (@telanganaawaaz) April 15, 2025
ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్
చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్ల మళ్లింపు
100 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసివేత.@SCRailwayIndia @ApnaSecbad
ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?
ఈ రైళ్లు మళ్లింపు..
ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ నుండి చర్లపల్లికి తాత్కాలికంగా మార్చనున్నారు. సికింద్రాబాద్ - అగర్తల (ఏప్రిల్ 28 నుండి), అగర్తల - సికింద్రాబాద్ (మే 2 నుండి), సికింద్రాబాద్ - ముజఫర్పూర్ (మే 1 నుండి), ముజఫర్పూర్ - సికింద్రాబాద్ (ఏప్రిల్ 29 నుండి), సికింద్రాబాద్ - సాంత్రాగచి (ఏప్రిల్ 29 నుండి), సంత్రాగచి - సికింద్రాబాద్ (ఏప్రిల్ 30 నుండి), సికింద్రాబాద్ - దానపూర్ (ఏప్రిల్ 26 నుండి), దానాపూర్ - సికింద్రాబాద్ (ఏప్రిల్ 28 నుండి), హైదరాబాద్ - రక్సౌల్ (ఏప్రిల్ 26 నుండి) మరియు రక్సౌల్ - హైదరాబాద్ (ఏప్రిల్ 29 నుండి) ఉన్నాయి.
ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
మౌలా అలీ 'సి' క్యాబిన్ - అమ్ముగూడ - సనత్‌నగర్ (సికింద్రాబాద్ - బేగంపేట - సనత్‌నగర్‌కు బదులుగా) మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌ను తాకకుండా మళ్లించిన రైళ్లు పూర్ణ - తిరుపతి మరియు తిరుపతి-పూర్ణ. సికింద్రాబాద్ స్టేషన్‌ను తాకకుండా చర్లపల్లి – మౌలా అలీ 'జి' క్యాబిన్ – దయానంద్ నగర్-మేడ్చల్ (సికింద్రాబాద్ – దయానంద్ నగర్ – మేడ్చల్‌కు బదులుగా) మీదుగా రైళ్లను నాందేడ్-ఈరోడ్ వీక్లీ మరియు ఈరోడ్-నాందేడ్ వీక్లీగా మళ్లించారు.