/rtv/media/media_files/2025/03/03/4zIsd7AnvNFkjiV9Qv6y.jpg)
medhapatkar (1) Photograph: (medhapatkar (1))
మూసీ సుందరీకరణ వివాదం మరో సారి తెరమీదకు వచ్చింది. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్లనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్మదా బచావో అనే నినాదంతో ఆమె ఓ పర్యావరణ ఉద్యమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమంతో ఆమె బాగా ప్రసిద్ధి. మేధా పాట్కర్ అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు.
Also read:MLC elections Counting: 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం
చాదర్‌ఘాట్ సమీపంలోని ఆమె ఫ్రెండ్ ఇంటికి వచ్చినట్లు మేధా పాట్కర్ పోలీసులకు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు వినలేదు. పోలీసులు ఆమెను అనేక ప్రశ్నలు వేసి.. ఆ ప్రాంతంలో ఉండకూడని వెళ్లిపొమ్మన్నారు. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ఎన్నో పర్యావరణ ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాలపై పోరాడింది. ప్రస్తుతం హైదరాబాద్ చాదర్‌ఘాట్ సమీపంలోనే ఉన్నారు. పోలీసులు ఆమెను ఆ ప్రాంతంలో ఉండొద్దని పంపించి వేశారు.
Also Read ; Adulterated milk: డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..!