/rtv/media/media_files/2025/03/07/V94L1cPp9c8VeBnwlWJ2.jpg)
KBHP drunk and drive Photograph: (KBHP drunk and drive)
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ముగ్గురు అమ్మాయిలు కారులో హల్‌ఛల్ చేస్తూ రెచ్చిపోయారు. యువతులు KBHPలో గురువారం రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి కారు నడిపారు. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసి రోడ్డుపై కొందరి బైక్‌లను ఢీకొట్టారు. ఇదేంటని ప్రశ్నించిన యువకుడిని బెదిరించారు.
పైగా రివర్స్‌లో యువకుడిపైకి గొడవకు దిగారు ఆ అమ్మాయిలు. ఎందుకు ఇలా ర్యాష్ డ్రైవిండ్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు యువకుడిపై బూతులతో రెచ్చిపోయారు కారులో ఉన్న ముగ్గురు లేడీస్. దీంతో అనుమానం వచ్చి ఆ యువకుడు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని వారికి కారు నడుపుతున్న అమ్మాయికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో కారు నడుపుతున్న యువతికి 212 పాయింట్లు రీడింగ్ వచ్చింది. కారులో బీర్ బాటిల్స్ కూడా ఉన్నాయి.