Hyderabad : హైదరాబాద్‌లో లవ్ జీహాద్‌..  పాకిస్తానీ యువకుడు అరెస్ట్ !

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తానీ వ్యక్తి ఫహద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఫహద్‌ అనే వ్యక్తికి పాకిస్థాన్‌ మూలాలున్నాయి.

New Update
hyd

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తానీ వ్యక్తి ఫహద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఫహద్‌ అనే వ్యక్తికి పాకిస్థాన్‌ మూలాలున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో హైదరాబాద్ లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆఫీసులో పనిచేస్తున్న హిందూ యువతి కీర్తిని లవ్ పేరుతో ట్రాప్ చేశాడు. ఆమెను మతం మార్పించి  2016లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరును  దోహా ఫాతిమాగా మార్చాడు. ఇది చాలాదు అన్నట్టుగా మరో అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో దోహాఫాతిమా వారిని వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది.  

1998లో పాకిస్థాన్‌ నుంచి

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఫహద్‌ 1998లో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు.  గతంలో ఇలాగే అమ్మాయిలను లవ్ పేరుతో ట్రాప్ చేసి  మతమార్పిడి చేయించేవాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితురాలు కీర్తికి  తనకు న్యాయం చేయాలని సినీ నటి కరాటే కల్యాణిని ఆశ్రయించింది. కీర్తికి కరాటే కల్యాణి బంధువు కావడంతో ఆమె కొంత మందితో కలిసి  బంజారాహిల్స్ లో ఉంటున్న పాకిస్తానీ వ్యక్తి ఫహద్ ఇంటికి వెళ్లారు. ఫహద్ తో పాటుగా అతని ప్రియురాలిని అరెస్టు చేశారు. ఫహద్ తనను బలవంతంగా మతం మార్పించి , వివాహం చేసుకుని  మోసం చేశాడని కీర్తి ఫిర్యాదులో ఆరోపించింది.  

కేరళలో దారుణం

కేరళలో దారుణం జరిగింది. పెళ్లికి ముందు ఇస్లాం మతంలోకి మారాలంటూ ప్రియుడు, అతని కుటుంబం ఒత్తిడి చేయడంతో ఓ 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్ ట్రైనింగ్ కోర్సు విద్యార్థిని అయిన సోనా ఎల్దోస్, తన ప్రియుడు రమీస్ తో ప్రేమలో ఉంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రమీస్..  అతని ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ అతని కుటుంబం పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి మారాలని ఆమెను  పట్టుబట్టింది. లేకపోతే పెళ్లి ఒప్పుకోమని చెప్పి్ంది. దీనికి తోడు ప్రియుడు లైంగికంగా, మానసికంగా వేధించడంతో  యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చివరగా ఆమె తన  తన సూసైడ్ నోట్ లో ఈ విషయాలను వెల్లడించింది. 

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె డెత్ నోట్‌లో రమీస్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని, గదిలో బంధించాడని, పెళ్లికి ముందు మతం మారమని బలవంతం చేశాడని యువతి అందులో ఆరోపించింది. రమీస్ ఆమెపై దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. రమీస్ గతంలో అనైతిక అక్రమ రవాణా కేసులో అరెస్టు అయినట్లుగా పోలీసులు తెలిపారు. రమీస్‌పై గతంలో ఏడు మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు. ప్రియుడు రామిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు ఎర్నాకుళం జిల్లా పోలీసు చీఫ్ ఎం. హేమలత నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Also read : Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!

Advertisment
తాజా కథనాలు