/rtv/media/media_files/2025/02/16/sUsQD1Vg5DAJvkVs66zd.jpg)
Drunk and drive cases in Hyderabad
నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నా.. పోలీసులు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా.. మందు బాబులు మాత్రం మాట వినడం లేదు. తాగి వాహనాలు నడపడం ఆపడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. 14, 15 రోజుల్లో ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 368 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 38 కేసులు నమోదయ్యాయి.
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) February 16, 2025
బాలానగర్ పీఎస్ పరిధిలో 37, రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 30, నార్సింగి పరిధిలో 27 నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల్లో 308 మంది టూ వీలర్ వాహనాలకు సంబంధించినవి కాగా.. 46 ఫోర్ వీలర్ వెహికిల్స్ కు సంబంధించినవని పోలీసులు పేర్కొన్నారు.
21-30 ఏళ్ల మధ్య వారే అధికం..
ఇంకా పట్టుబడిన వారిలో 21-30 ఏళ్లు ఉన్న వారు 135 మంది కాగా.. 31-40 ఏళ్ల మధ్యలో ఉన్న వారు 129 మంది ఉన్నారు. మొత్తం 368 మందిలో అందరూ పురుషులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సిటీలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. తాగి నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.