Transgenders: తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్‌జెండర్లకు గౌరవం, అవకాషాలు ఇవ్వడం కోసం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ మేనేజ్మెంట్‌లో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. మొదటి సారి 2017లో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం ప్రారంభమైంది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో 39 మంది ట్రాంజెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగ అవకాశం కల్పించింది.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!
పలు చోట్లలో విధుల నిర్వహణ..
మంగళవారం హైదరాబాద్‌లోని పలు చౌరస్తాల వద్ద విధులు నిర్వహించారు. విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో శిక్షణ పొందారు. మలక్‌పేటలో ప్రాంతంలో మానస, ప్రేమ, సంతోష్ నగర్ పరిధిలో స్టేషన్ లో భానుప్రియ, నక్షత్ర ట్రాఫిక్ అసిసెంట్లుగా విధులలో చేరారు. అలాగే పలు చోట్ల పలువురు డ్యూటీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమీషనర్ మాట్లాడుతూ.. సమాజం, కుటుంబంలో ట్రాన్స్ జెండర్లు వివక్షకు లోనవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంతో వారిని అనుసంధానం చేయడానికి, వారి గౌరవాన్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డు క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
In #Hyderabad City Police new initiative to hire #transgenders as traffic assistants. They will be assigned duties starting tomorrow. Based on their performance on ground, we will recommend further postings. They are given opportunities at home guard level @CPHydCity pic.twitter.com/iC3LndN1JV
— Deepika Pasham (@pasham_deepika) December 22, 2024
Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!
ఇది కూడా చదవండి.. తిరుపతిలో అపచారం..అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టిన దుండగులు