శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ కలకలం.. ఇస్త్రీ పెట్టెలో ఇంత బంగారమా..?

శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం గోల్డ్ స్మగ్లింగ్ కలకలం రేపింది. 3.38 కేజీల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐరన్‌ బాక్స్‌లో బంగారం దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేశారు.

New Update
gold smugling

శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం గోల్డ్ స్మగ్లింగ్ కలకలం రేపింది. 3.38 కేజీల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐరన్‌ బాక్స్‌లో బంగారం దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.3.36 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమానస్పదంగా ప్రవర్తిస్తున్న ప్రయాణీకుల లాగేజ్ చెక్ చేయగా.. విషయం బయటపడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు బ్యాగ్‌లో ఉన్న ఇస్త్రీ పెట్టె ఓపెన్ చేసి చూడగా షాక్ అయ్యారు. గోల్డ్ బిస్కెట్లు రూపంలో అనుమానం రాకుండా ఇస్త్రీ పెట్టిలో విడిభాగాల్లా ఉంచారు. 

పన్నులు, సుంకాలు చెల్లించకుండా దేశంలోకి బంగారాన్ని అక్రమంగా తీసుకురావడమే స్మగ్లింగ్ ప్రధాన ఉద్దేశ్యం. అధిక లాభాల కోసం స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం స్మగ్లర్లకు ప్రధాన కేంద్రంగా మారింది, అందుకే ఇక్కడ తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

ఈ సంఘటనలు స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి అధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలను తెలియజేస్తున్నాయి. 

బంగారం అక్రమ రవాణా చేయడం అనేది కస్టమ్స్ చట్టం, 1962 కింద నేరం. అక్రమంగా బంగారం తరలించే వ్యక్తులపై కస్టమ్స్ అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. పట్టుబడిన బంగారం విలువ, దాని పరిమాణాన్ని బట్టి శిక్ష తీవ్రత ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు