Indiramma Housing : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపు ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం

తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఇందిరమ్మ ఇండ్ల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం తొలి అడుగువేసింది. రేపు సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయనున్నారు

New Update
Indiramma Houses

Indiramma Houses

Indiramma Housing : తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఇందిరమ్మ ఇండ్ల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం తొలి అడుగువేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇంటిస్థలం ఉన్న వారిని గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్దమైంది. ఇక తాజాగా రేపు సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున నిర్మాణం చేయనున్న ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

 శుక్రవారం సీఎం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట మండలంలోని అప్పకపల్లె లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి.. రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా.. వాటన్నిటికీ రేపు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేస్తారు.

ఇది కూడా చదవండి: TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల!

ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంలో భాగంగా.. లబ్దిదారులు స్వంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడితో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే రూ.1,00,000 లబ్దిదారుని ఖాతాకి నేరుగా విడుదలయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత విడతల వారీగా నిధులు విడుదల చేస్తారు. 

ఇది కూడా చూడండి:Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

Also Read: తల్లిని ఇంట్లో నిర్బంధించి భార్య , పిల్లలతో కుంభమేళాకు వెళ్లిన కొడుకు.. చివరికీ

Advertisment
తాజా కథనాలు