/rtv/media/media_files/2025/02/14/ivOeIAJPFoxKW9vmpKw0.jpg)
bhajarang dhal in kumbhu Photograph: (bhajarang dhal in kumbhu)
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో హైదరాబాద్ భజరంగ్‌ధళ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. మహా కుంభమేళాలో లౌకికవాదం, ఇస్లాం, క్రైస్తవ మతాలకు అనుగుణంగా సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ ప్రచారం చేస్తున్న బ్రహ్మ కుమారీ సేవకులపై భజరంగ్ ధళ్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని భ్రమ కుమారి స్వచ్ఛంధ సేవకులను భజరంగ్ ధళ్ కార్యకర్తలు అడ్డుకున్నామన్నారు. బ్రహ్మ కుమారీ వాహనాన్ని ఆపి వారిని వెనక్కి తిరిగి పోవాలని చెప్పారు. ఈ ఘటన వారం రోజుల క్రితమే జరిగింది.
Also Read : మోదీకి ఎలన్ మస్క్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే
Bajrangdal Hyderabad Karyakarta's caught Bhrama Kumari's volunteers who were demotivating Hindu Dharma promoting Secularism, Islam ,Christianity ‘Sabka Malik Ek Hai’ concept at Maha Kumbh Mela and threw them out pic.twitter.com/ieCGWf0fXk
— Viक़as (@VlKAS_PR0NAM0) February 3, 2025
బ్రహ్మ కుమారిస్ చేతిలో ఉన్న ప్రచార కరపత్రాలను తీసుకొని భజరంగ్‌ధళ్ సభ్యులు నిలదీశారు. బ్రహ్మ కుమారిస్‌కు వ్యతిరేకంగా భజరంగ్ ధళ్ కార్యకర్తలు నినాదాలు చేశారు. బ్రహ్మ కుమారిస్‌ను వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గొడవకు దిగిన భజరంగ్ కార్యకర్తలు హైదరాబాద్‌కు చెందిన వారు.
Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?