/rtv/media/media_files/2025/07/12/toddy-raids-2025-07-12-21-40-38.jpg)
హైదరాబాద్‌లో కల్తీ కల్లు మరణాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
HYD: కాచిగూడ,ముషీరాబాద్ లో కల్లు కంపౌండ్ లపై ఎక్సైజ్ తనికీలు.. pic.twitter.com/p9ZMdEosKr
— souryaabi (@souryaabi) July 12, 2025
మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లతోపాటు ముషీరాబాద్‌లో మూడు, కాచిగూడలో 2 కల్లు డిపోల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా చోట్ల సేకరించిన నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. శేరిలింగంపల్లి సిద్ధిక్‌నగర్‌లోని కల్లు కాంపౌండ్‌లో తనిఖీలు చేసిన అధికారులు.. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దుకాణాన్ని సీజ్ చేయడంతోపాటు యజమానిపై కేసు నమోదు చేశారు.