గద్దర్‌ను అలా చేసినందుకే KCR గడీలు బద్దలైయ్యాయ్ : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాయుద్ద నౌక గద్దర్‌ను అవమానించినందుకే కేసీఆర్ గడీలు బద్దలైయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ జయంతి సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను హెచ్చరించారు. గద్దర్‌ని కించపరుస్తూ మాట్లాడితే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.

New Update
Revanth Reddy Vs KCR

Revanth Reddy Vs KCR

గద్దర్‌ కలవడానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఆయన్ని ఇంటి బయట నిలబెట్టినందుకే కేసీఆర్ గడీలు బద్దలైయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ప్రజాయుద్ద నౌక గద్దర్ జయంతి సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గద్దర్‌ను తక్కువ చేసి మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వార్నింగ్ ఇచ్చారు. పద్మ అవార్డులకు గద్దర్ పేరు నామినేట్ చేస్తే.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సభ వేదికగా మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు!

గద్దర్ కుటుంబం ప్రజల కోసం సర్వం కోల్పోయిందని, వారి ఏనాడు నాడు కంటి నిండా నిద్ర పోలేదని ఆయన అన్నారు. నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారు. ఆయన తన గళంతో సమాజానికి స్పూర్తినిచ్చారు. మరో సారి గద్దర్‌పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. బీజేపీ కార్యాలయాలు ఉన్న చోట కాలనీలకు గద్దర్ అన్న పేరు పెడతామని సవాల్ చేశారు. గద్దర్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిష్టాత్మకంగా గద్దర్ అన్న అవార్డులను ఏర్పాటు చేసి.. వాటి బాధ్యతలు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు