Hyderabad : బస్సు ఆపలేదని కండక్టర్ పీక పట్టుకుంది.. వీడియో వైరల్!

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి బస్సులోని కండక్టర్ లపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. బస్సు ఆపకపోవడం వల్లనో,  సీటు దోరకకపోవడం వల్లనో ఇలా రకరకాల కారణాలతో ప్రయాణికులు కండక్టర్లపై దాడులకు దిగుతున్నారు.

New Update
conductor

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి బస్సులోని కండక్టర్ లపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. బస్సు ఆపకపోవడం వల్లనో,  సీటు దోరకకపోవడం వల్లనో ఇలా రకరకాల కారణాలతో ప్రయాణికులు కండక్టర్లపై దాడులకు దిగుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే నగరంలో ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్‌పై దాడి చేసింది మహిళా ప్రయాణికురాలు.  

మహిళా కండక్టర్ పై బూతుపురాణం

బస్సు ఆపాలని ప్రయాణికురాలు డ్రైవర్ ను కోరగా ఎక్కడ పడితే అక్కడ ఆపమని చెప్పినందుకు డ్రైవర్, మహిళా కండక్టర్ పై బూతుపురాణం అందుకుంది.  అంతేకాకుండా కండక్టర్ పై దాడికి దిగింది. ఏకంగా ఆమె పీక పట్టుకుంది.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు జరగగా.. వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడించారు.  

Advertisment
తాజా కథనాలు