/rtv/media/media_files/2025/02/21/1Jx1RwUJYB4YEIrX4fuq.jpg)
6 year old boy stuck in apartment elevator in hyderabad
తెలంగాణలోని హైదరాబాద్‌లో గుండె విలవిల్లాడే ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. లిఫ్ట్ గ్రిల్స్ క్లోజ్ చేయకుండానే లిఫ్ట్ మూవ్ అవడంతో ఆ బాలుడు లిఫ్ట్‌కి అపార్ట్మెంట్ గోడకి మధ్య ఇరుక్కుపోయాడు. అనంతరం ఆ బాలుడ్ని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాంపల్లిలో ఘటన
నాంపల్లి శాంతిగరలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల బాలుడు చిక్కుకున్నాడు. లిఫ్ట్ గ్రిల్స్ క్లోజ్ చేయకుండానే ఆ లిఫ్ట్ మూవ్ అయింది. దీంతో ఆ బాలుడు లిఫ్ట్‌కి అపార్ట్మెంట్ గోడకి మధ్య ఇరుక్కుపోయాడు. ఆ బాలుడ్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే హైడ్రా DRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు..
— RTV (@RTVnewsnetwork) February 21, 2025
హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయిన ఘటన వెలుగు చూసింది. మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.… pic.twitter.com/ifuZpkcNB0
అనంతరం గోడలు బద్దలు కొట్టి, గ్రిల్ కట్ చేశారు. అలా దాదాపు 2 గంటల పాటు కష్టపడి ఆ బాలుడ్ని బయటకు తీశారు. వెంటనే అతడిని నిలోఫర్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స కొనసాగుతోంది. అయితే అపార్ట్‌మెంట్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ అదే లిఫ్ట్ రిపేర్లో ఉన్నప్పటికీ అపార్ట్‌మెంట్ ఓనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం.