Sarfaraz Ahmed : హైదరాబాద్ మెట్రో మ్యాన్ కి ఉద్వాసన..హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌..

హైదరాబాద్‌కు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉన్న మెట్రోరైల్‌  ఎండీగా ఐఏఎస్‌ అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ ను ప్రభుత్వం నియమించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ప్రభుత్వం మెట్రో ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

New Update
metro nvs reddy

sarfaraz ahmed, metro nvs reddy

Sarfaraz Ahmed :హైదరాబాద్‌కు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉన్న మెట్రోరైల్‌  ఎండీగా ఐఏఎస్‌ అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ ను ప్రభుత్వం నియమించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న ఆయనకు ప్రభుత్వం మెట్రో ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్, మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణ, నిర్వహణలో సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తారు.హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో తీవ్రంగా నష్టపోయిన ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ టీ, తన వాటాలను విక్రయించేందుకు రెడీగా ఉన్నామని  ప్రకటించిన సమయంలో మెట్రో ఎండీ మార్పు చర్చనీయాంశమైంది. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ టీ తన వాటాలను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని కోరుతోంది. భారీగా నష్టాలు వస్తుండడం, అప్పులు పెరిగిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  కొత్త స్పెషల్ పర్పోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీవీ)  ద్వారా ఈ విక్రయం జరగాలని కోరింది. ఇందుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపింది.


 ఎన్‌వీఎస్ రెడ్డికి కీలక బాధ్యతలు

మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్‌ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రభుత్వ సలహాదారు (అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌)గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీసెస్‌ (ఐఆర్‌ఏఎస్‌) అధికారిగా ఉన్న ఎన్వీఎస్‌ రెడ్డి 2017లో పదవీ విరమణ చేశారు. అయినా..ఆయనను మెట్రో రైలు ఎండీగా నియమించారు. ఆ తర్వాత కూడా  ప్రభుత్వాలు ఆయన సర్వీసును పలుమార్లు పొడిగిస్తూ వచ్చాయి.  గత నియామకం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 వరకు ఆయన మెట్రో రైలు ఎండీగా కొనసాగాల్సి ఉన్నప్పటికీ,  ప్రభుత్వం ఆయనను ఆ పోస్టు నుంచి రిలీవ్‌ చేసి, పట్టణ రవాణా వ్యవస్థ సలహాదారుగా నియమించింది.  హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్, మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణ, నిర్వహణలో సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తారు.

హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్‌ (HMRC) మేనేజింగ్ డైరెక్టర్ గా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్‌వీఎస్ రెడ్డికి కీలకమైన కొత్త బాధ్యతలను అప్పగించారు. రేవంత్ సర్కార్ ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా (పట్టణ రవాణా శాఖ)నియమించింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. మెట్రో రైలు వ్యవస్థ అభివృద్ధిలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం, నిపుణతను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది.   సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం, పట్టణ రవాణా రంగంలో ఆయన అనుభవాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా (పట్టణ రవాణా శాఖ) నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌వీఎస్‌ రెడ్డి దశాబ్దాలపాటు మెట్రో రైలు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రణాళిక, నిర్మాణం, ఆపరేషన్స్‌ వరకు ప్రతీ దశలోనూ ఆయన సూచనలు, పర్యవేక్షణతో మెట్రో రైలు వ్యవస్థ విజయవంతంగా ముందుకు సాగింది. హైదరాబాదు వంటి వేగంగా పెరుగుతున్న నగరంలో ప్రజలకు సౌకర్యవంతమైన, సమయాన్ని ఆదా చేసే రవాణా ప్రత్యామ్నాయంగా మెట్రోను రూపుదిద్దడంలో ఆయన కృషి ప్రత్యేకంగా నిలిచింది. ఈ అనుభవం దృష్ట్యా ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా, పట్టణ రవాణా ప్రాజెక్టుల విస్తరణకు, కొత్త రవాణా విధానాల రూపకల్పనకు ఆయన సలహాలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది 

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

Advertisment
తాజా కథనాలు