KTR: కేటీఆర్ అరెస్ట్?

గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్‌ లో అవకతవకలు జరిగాయన్న వార్తలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారం నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

New Update

'రెండు రోజుల్లో బాంబులు పేల్చేస్తాం..' మంత్రి పొంగులేటి చేసిన ఈ కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. కేటీఆర్‌ టార్గెట్‌గానే పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అప్పట్లో హైదరాబాద్‌ను ఓ ఊపు ఊపిన ఫార్ములా-ఈ రేసింగ్‌లో స్కామ్‌ జరిగిందని.. దాని గురించి రేవంత్‌ సర్కార్‌ సంచలన నిజాలు బయటపెట్టబోతుందన్న టాక్‌ నడుస్తోంది. ఇంతకీ అసలు ఫార్ములా-ఈ రేసింగ్‌లో ఆ నాడు ఏం జరిగింది?

Also Read :  మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు

గతేడాది ఫిబ్రవరిలో ఈ కార్ రేసింగ్..

ఫిబ్రవరి 11, 2023లో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా హుస్సేన్ సాగర్ తీరంలో రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకుపోయాయి. ఇండియాలో మొదటిసారి జరిగిన ఈ అంతర్జాతీయ ఫార్ములా - ఈ రేసింగ్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు భాగ్యనగరానికి క్యూ కట్టారు. ఇదంతా బీఆర్ఎస్‌ ప్రభుత్వం రూలింగ్‌లో ఉండగా జరిగింది. ఆ తర్వాత 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే 2024 ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన హైదరాబాద్ ఇ-ప్రిక్స్ స్టేజింగ్‌ను రద్దు చేసింది.

Also Read :  శ్రీలీలకు భారీ షాక్ ఇచ్చిన పూజా హెగ్డే?

మొదటిసారి నిర్వహణ సమయంలో ట్రాక్‌ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు బీఆర్ఎస్ రూ.5 కోట్ల వరకు ఖర్చు పెట్టిందన్న ఆరోపణలున్నాయి. మిగతాది అంతా ప్రమోటర్‌ సంస్థనే చూసుకుందట. అయితే రెండో సీజన్ నిర్వహణకు ట్రాక్‌, రేసింగ్‌ నిర్వహణ, మార్కెటింగ్‌, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పనకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వమే రూ.200 కోట్ల వరకూ భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సమయంలో కేబినెట్ అనుమతి తీసుకోకుండా పట్టణాభివృద్ధి శాఖను చూసిన అర్వింద్ కుమార్ రూ. 55 కోట్లను మంజూరు చేశారన్న వాదన ఉంది. అయితే అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పబట్టే డబ్బులు రిలీజ్ చేశానని అర్వింద్‌ కుమార్‌ అధికారులకు చెప్పడం సంచలనం రేపింది. మరోవైపు ఈ 55 కోట్ల డబ్బులను రికవరీ చేసేందుకు రేవంత్‌ సర్కార్ ప్రయత్నిస్తోంది. 

Also Read :  పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?

నిబంధనల ఉల్లంఘనలు?

ఫార్ములా-ఈ కార్ల రేస్‌ వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని రేవంత్‌ సర్కార్‌ గట్టిగా నమ్ముతోంది. ముఖ్యంగా పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరగడంపై ఫోకస్ చేస్తోంది. ఇక RBI అనుమతి తీసుకోకుండా విదేశీసంస్థకు నిధుల బదిలీ జరగడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ ద్వారా విచారణ చేయించడంతోపాటు దర్యాప్తు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈడీని కోరినట్లు సమాచారం.

ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లించిందన్నది అభియోగంపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు సీఎస్‌ శాంతికుమారి మెమో ఇవ్వడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీనికి అర్వింద్‌కుమార్‌ జవాబిస్తూ... మొత్తం ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు జరిపామని, ఇదంతా పురపాలక పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఇప్పుడితే కేటీఆర్‌కు పెద్ద చిక్కు తెచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read :  39 కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు.. ఏక్ పోలీస్ విధానం అంటే ఏంటి ?

Advertisment
Advertisment
తాజా కథనాలు