CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ!
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు.