/rtv/media/media_files/2025/09/05/ganesh-immersion-2025-09-05-13-32-34.jpg)
Ganesh immersion
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది గణపయ్య వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించారు. ఈ ఏడాది గణపతి ఉత్సవాల ద్వారా హైదరాబాద్ నగరంలో దాదాపుగా రూ.650 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. చిన్న, పెద్ద వ్యాపారాలకు ఈ గణపతి ఉత్సవాల వల్ల భారీగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలోని ధూల్‌పేటలో సుమారుగా రూ.50 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు..
ఇక్కడ కొన్ని నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలుపెడతారు. చిన్న విగ్రహాల నుంచి భారీ గణపతుల వరకు ఇక్కడ తయారు చేస్తారు. ఈ వ్యాపారంపై వందలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. విగ్రహాల తయారీలో మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు, అలంకరణ సామాగ్రి వంటి వాటికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ వ్యాపారం స్థానిక కళాకారులకు, కార్మికులకు మంచి ఉపాధిని కల్పిస్తుంది. వినాయకుడి తయారీకి కావాల్సిన వస్తువుల నుంచి నిమజ్జనం వరకు అన్నింటి వరకు రూ.650 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
గణేశ్ ఉత్సవాలు అనేక రకాల వ్యాపారాలకు మంచి గిరాకీ ఉంటుంది. మండపాలను అలంకరించేందుకు అవసరమైన విద్యుత్ దీపాలు, పూలమాలలు, అలంకరణ వస్తువులు, పందిళ్లు వంటి వాటికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. వీటి ద్వారా టెంట్ హౌస్‌లు, పూల వ్యాపారులు, ఎలక్ట్రీషియన్లకు మంచి ఆదాయం లభిస్తుంది. అలాగే పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, పండ్లు, పత్రి, పసుపు, కుంకుమ, కర్పూరం వంటి వాటి అమ్మకాలు పెరుగుతాయి. వీధుల్లో చిన్న చిన్న దుకాణాలు, చిరు వ్యాపారులు ఈ ఉత్సవాల ద్వారా గణనీయమైన లాభాలు పొందుతారు. గణపతికి నైవేద్యంగా పెట్టే లడ్డూలు, మోదకాలు, అన్నప్రసాదాల తయారీ కూడా ఒక పెద్ద వ్యాపారంగా మారింది.
హైదరాబాద్‌లో ప్రసిద్ధ లడ్డూల వేలం పాటలు కూడా కోట్ల రూపాయలు పలుకుతాయి. వీటిని తయారు చేసే స్వీట్ షాపులు, కేటరింగ్ సేవలు కూడా గణేశ్ ఉత్సవాల కోసం ప్రత్యేక ఆర్డర్లు తీసుకుంటాయి. మండపాల్లో అన్నప్రసాదం నిర్వహించడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. గణేశ్ విగ్రహాలను మండపాలకు చేర్చడానికి, అలాగే నిమజ్జనానికి తీసుకెళ్లడానికి భారీ వాహనాలు, ట్రాక్టర్లు, క్రేన్లను అద్దెకు తీసుకుంటారు. ఈ రవాణా సేవలు కూడా ఒక ముఖ్యమైన వ్యాపారంగా మారాయి. ఒక్కో విగ్రహాన్ని తరలించడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇలా మొత్తం రూ.650 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!