/rtv/media/media_files/yNpX8093iiUIQEMuMZKi.jpg)
TGRTC: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణంలో తిప్పలు ఉండకుండా ఏర్పాట్ల పై గ్రేటర్, రంగారెడ్డి ఆర్టీసీ దృష్టి పెట్టింది. గతేడాది జరిగిన ఇబ్బందుల దృష్ట్యా నగరం నుంచి ఎక్కు సంఖ్యలో బస్సులు పంపేందుకు సిద్ధమవుతోంది. పండగ ప్రయాణాల నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ నుంచి 1500 బస్సులు,రంగారెడ్డి రీజియన్ నుంచి 500 బస్సులను 10,11 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను నడిపింది.
Also Read: Hollywood: మీరంతా నిజమైన హీరోలు.. కార్చిచ్చు పై ప్రియాంక పోస్ట్!
అయితే తిరుగు ప్రయాణంలోనూ ఈ సేవలను వినియోగించుకోవాలని ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థనల ఆధారంగా ఖాళీగా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ లను జిల్లాలను పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జూనియర్ ఇంటర్ కళాశాలలు, పాఠశాలలు వేర్వేరు తేదీల్లో పునః ప్రారంభం అవుతుండటంతో సమన్వయంతో బస్సులు నడిపేందుకు గ్రేటర్, రంగారెడ్డి రీజియన్ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తున్నాయి.
Also Read: సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
సీట్లు లేవు....
నగరానికి చేరుకొనే ఫలక్‌నుమా,కోణార్క్, ఈస్ట్ కోస్ట్, విశాఖ, గౌతమి,నారాయణాద్రి, విశాఖపట్నం దురంతో, వందేభారత్ , శబరి, విశాఖ, గరీబ్ రథ్, జన్మభూమి తదితర రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉంది.
సొంతూళ్లకు వెళ్లిన వారిలో అత్యధికులు శుక్రవారం కల్లా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏపీలోని స్వస్థలాలకు వెళ్లిన వారు తిరిగి శని, ఆదివారాల్లో రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం, కోదాడ, ఖమ్మం నుంచి వచ్చే బస్సుల్లో దాదాపు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం , కాకినాడ, భీమవరం, విజయవాడ,నెల్లూరు ఉంచి 17న వచ్చే సాధారణ బస్సుల్లో దాదాపు సీట్లు లేవు.
18న భారీగా ప్రయాణాలున్నాయి. రంగారెడ్డి రీజియన్ నుంచి విజయవాడ,అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఒంగోలు, కందుకూరు, కనిగిరి, కర్నూలు ప్రాంతాలకు సాధారణ రోజుల్లో 300 బస్సులు నడుపుతుండగా...సంక్రాంతి నేపథ్యంలో 200 అదనపు బస్సులు నడిపినట్లు రంగారెడ్డి ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Also Read: Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే ?
Also Read: టార్గెట్ సైఫా లేక పిల్లలా? .. సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు!