VIRAL VIDEO: వామ్మో.. ఈ వీడియోలు చూస్తే లైఫ్‌లో కేక్ తినరు, ఇంత దారుణమా!

తెలంగాణలోని అల్వాల్ మచ్చ బొల్లారంలో కేక్ తయారీదారుల బాగోతం బయటపడింది. మోంగినిస్ కేక్ షాప్‌లో బొద్దింకల మధ్య కేక్‌ల తయారీ చూసి పోలీసులు షాకయ్యారు. కాలంచెల్లిన పదార్థాల వాడకం, శుభ్రం లేని ఫ్రిడ్జ్‌లు, ప్లాస్టిక్ డ్రమ్ములో కేక్‌ల తయారీ సంచలనంగా మారింది.

New Update
Hyderabad adulterated cake manufacturing

Hyderabad adulterated cake manufacturing

కేకు అంటే అందరికీ ఇష్టమే. చాలా మంది బర్త్ డే సెలబ్రేషన్స్‌కు కేక్‌తో పార్టీ చేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కేక్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. బ్రెడ్ కేక్, కూల్ కేక్ అంటూ మార్కెట్‌లోకి చాలానే వచ్చాయి. అందులోనూ రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి. మరి ఎంతో నోరూరించే ఈ కేక్‌ తయారీ చూస్తే లైఫ్‌లో ఇంకెప్పుడూ తినాలని అనుకోరు. 

అవును.. నిజమే.. ఈ మధ్య ఆహారంలో కల్తీ ఎక్కువైపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు కల్తీ ఆహారాన్ని ప్రజలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే బిర్యానీ, వంట సరుకులు, కూరగాయలు, గుడ్లు ఇలా ప్రతీ వస్తువూ కల్తీ అవుతుందని తేలింది.

ఇది కూడా చూడండి:  96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 

కల్తీ కేక్ తయారీ

ఇక ఇప్పుడు కేక్‌ను కూడా కల్తీగా మార్చేసారు కొందరు వ్యాపారులు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని అల్వాల్ మచ్చ బొల్లారం మోంగినిస్ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కేకును తయారుచేస్తున్న విధానం చూసి పోలీసులు ఖంగుతిన్నారు. బొద్దింకలు, ఎలుకలు మధ్య కేక్‌లను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఇది కూడా చూడండి: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

అంతేకాకుండా డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు కేక్‌లో వాడుతున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. కోకోనట్ పౌడర్, వెనీలా ఫ్లేవర్ సిరప్, కేసర్ సిరప్, పైన్ యాపిల్ సిరప్‌లను సీజ్ చేశారు అధికారులు. అంతేకాకుండా అక్కడే ఎలాంటి క్లీనింగ్ లేని ఫ్రిడ్జ్‌లు, ప్లాస్టిక్ డ్రమ్స్‌లో కేకులను తయారు చేస్తున్నట్లు చూసి షాక్ అయ్యారు. దీంతో బేకరి నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

రమ్‌తో ఫ్లమ్ కేక్స్ తయారీ

మరోవైపు సికింద్రాబాద్-కార్ఖానాలోని వాక్స్ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓల్డ్ మాంక్ రమ్‌తో ఫ్లమ్ కేక్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. న్యూ ఇయర్ సందర్భంగా కేక్స్ టేస్ట్ కోసం అందులో మద్యం కలిపినట్లు తేలింది. ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా ప్లమ్ కేక్స్‌ తయారీలో రమ్ ఉపయోగించారని అధికారులు గుర్తించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు