Saleshwaram Jathara: : వత్తన్నం వత్తన్నం లింగమయ్యో..అంటూ తెలంగాణ అమర్ నాథ్ యాత్రకు...

ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా 4 రోజుల పాటు జరిగే సలేశ్వర లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలవబడే జాతర నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరంలో ఏటా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరవుతున్నారు.

New Update
Saleshwaram Jatara

Saleshwaram Jatara

Saleshwaram Lingamayya :ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే సలేశ్వర లింగమయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలవబడే జాతర నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరంలో ఏటా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు.  

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

సలేశ్వరం  తెలంగాణలోని ఒక యత్రా స్థలం. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రాస్థలం. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత చైత్ర పౌర్ణమికి మొదలవుతుంది. అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వుంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు.

Also Read :  అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ..పూజారి పై దాడి!

ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మాహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులలో ఉంది. హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటరు రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.

అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు' పుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది భారతదేశంలోనే అతి పెద్ద పులుల సరక్షణా కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది.

Also Read :  పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?

తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలొ ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరుకుంటాం. గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. 

ఇది కూడా చదవండి: బియ్యాన్ని వంటకే కాదు.. ఇలా కూడా ఉపయోగించవచ్చు

తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవ మైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మ విగ్రహాలున్నాయి.

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులపాటూ జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.

వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారి రద్దీగా మారింది. మన్ననూరు చెక్‌పోస్ట్ వద్ద సలేశ్వరం వెళ్లే వాహనాలు టోల్ రుసుము చెల్లించే క్రమంలో ఆలస్యం అవుతుండటంతో రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆరు కిలోమీటర్ల మేర సిద్ధాపూర్ క్రాస్ వరకు రద్దీ నెలకొంది. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

Also Read :  నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి

Advertisment
తాజా కథనాలు