/rtv/media/media_files/2025/10/20/rowdy-sheeter-riyaz-encounter-2025-10-20-14-48-40.jpg)
Rowdy sheeter Riyaz encounter
BIG BREAKING: కానిస్టేబుల్‌ను హత్యచేసి పారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఈ రోజు మధ్యాహ్నం నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో ఎన్ కౌంటర్ అయ్యాడు. కాగా రియాజ్ మృతిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు అందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిన్న గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్.. గది బయట కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడన్నారు. గన్ లాక్కూని అనంతరం పోలీసులపై కాల్పులు జరిపేందుకు రియాజ్ ప్రయత్నించాడన్నారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వారి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో నిందితుడిపై కాల్పులు జరిపాల్సి వచ్చిందన్నారు. ఈ కాల్పుల్లో రౌడీ షీటర్ రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. ఒక వేళ రియాజ్ కాల్పులు జరిపి ఉంటే ఆస్పత్రిలో ఉన్న చాలా మంది ప్రాణాలు పోయేవని అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే పోలీసులు సమయస్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని డీజీపీ తెలిపారు. అయితే మొదట రియాజ్ కాల్పులు జరపగా ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని, కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా పోలీసులు నింధితునిపై కాల్పులు జరిపారని డీజీపీ స్పష్టం చేశారు. కాగా నిన్న రియాజ్ చేతిలో గాయపడ్డ అసిఫ్‌కు హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నామని డీజీపీ తెలిపారు.
కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటాం.. డీజీపీ
రౌడీ షీటర్ రియాజ్ చేతిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్ మెంట్ అండగా ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి పరిహారం అందజేస్తామన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ప్రమోద్ ఉద్యోగ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామన్నారు. 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు
పోలీస్ భద్రత సంక్షేమ నుంచి రూ,16 లక్షలతో పాటు పోలీస్ వెల్పేర్ నుంచి రూ,8 లక్షల పరిహారం ఇస్తామని డీజీపీ ప్రకటించారు. ఈ విషయాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని తెలిపారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఆయన నివాళులు అర్పించారు.
కానిస్టేబుల్ ప్రాణాలు తీసి..చివరికి..
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ధృవీకరించారు. వాహనాల దొంగతనంలో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్‌ను రెండు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో చంపి పారిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్రంగా స్పందించారు. నిందితున్ని పట్టుకునేందుకు 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనంతరం రియాజ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ రియాజ్ ఆదివారం మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఒక పాత లారీ క్యాబిన్‌లో దాక్కున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే రియాజ్‌ను తరుముతూ వెళ్లిన పోలీసులు అతనికి ఎదురుగా వస్తున్న యువకులను అప్రమత్తం చేశారు. దీంతో ఆ యువకులు రియాజ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ వ్యక్తి పై రియాజ్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు రియాజ్‌ను అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఆసిఫ్ అనే యువకుడి కూడా మొదట స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. అయితే అప్పుడే రియాజ్‌ఎన్ కౌంటర్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అతను గాయపడ్డాడని ఆసుపత్రికి తరలించామని పోలీసులు ప్రకటించారు.
కాగా రియాజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం రియాజ్ కు నాలుగు రకాల ఎక్సరేలు తీసినట్లు అధికారులు తెలిపారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే అక్కడే ఉన్న ఏ ఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో జరిపిన కాల్పు్ల్లో నిందితుడు మరణించాడని స్పష్టం చేశారు.
Also Read : దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!