దామగుండం ఫారెస్టులో బతుకమ్మ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వికారాదాద్‌ జిల్లా దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసింది.

bathukamma 2
New Update

వికారాదాద్‌ జిల్లా దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో బహుజన బతుకమ్మకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆ ఫారెస్టులో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. అక్టోబర్ 6న ఆదివారం జరగనున్న ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమానికి పోలీస్ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కని స్పష్టం చేసింది. ఇప్పటికే దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రాడర్ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  

Also Read: పిల్లల్ని కంటావా?..మీ చెల్లితో పెళ్లి చేస్తావా? భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం..

ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్న దామగుండం రిజర్వ్‌ ఫారెస్ట్‌కు వందళ ఏళ్ల చరిత్ర ఉంది. అనంతరగిరి రిజర్వ్‌ ఫారెస్ట్‌ను ఆనుకుని ఉన్న దామగుండం అడవిలో కొన్ని వేల రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సబ్‌మెరైన్స్, నౌకల కమ్యూనికేషన్ కోసం రాడర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. దాదాపు 3 వేల ఎకరాల్లో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం ఫారెస్టులో 12 లక్షల మొక్కలు నరికివేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు నౌకాదళం కూడా ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులో తాము మళ్లీ 11 లక్షల 70 వేల మొక్కలు నాటుతామని కూడా పేర్కొంది. దీన్నిబట్టి అడవిలో ఉన్న దాదాపు 12 లక్షల చెట్లను నరికేసి, అడవిని నాశనం చేసి ఈ రాడర్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారని అక్కడి స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

అంతేకాదు హైదరాబాద్‌కు వచ్చే మూసీ నది కూడా దామగుండం అటవీ ప్రాంతంలోనే  మూసీ నది ప్రారంభమవుతుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెట్లు కూడా అక్కడ ఉన్నాయి. 500 ఏళ్లుగా కొలువైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా అక్కడ ఉంది. పచ్చని చెట్లతో, స్వచ్ఛమైన గాలిని అందించే ఈ దామగుండం ఫారెస్టులో రాడర్ స్టేషన్ నిర్మించడం ఏమాత్రం మంచిది కాదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ను కట్టడి చేసేందుకు అడవులను పరిరక్షించాల్సి ఉండగా.. ఇప్పుడు ఏకంగా దాదాపు 3 వేల ఎకరాలున్న అడవిని ధ్వంసం చేయడం వల్ల వికారాబాద్‌ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు కూడా భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని చెబుతున్నారు. 

#vikarabad #forest #Bathukamma 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe