పిల్లల్ని కంటావా?..మీ చెల్లితో పెళ్లి చేస్తావా? భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంతాలతండాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని కుటుంబ సభ్యులు, భర్త వేధింపులకు పాల్పడడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పిల్లలను కంటావా? నీచెల్లితో పెళ్లి చేస్తావా? అంటూ ఆ మహిళను భర్త టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది.

New Update
 Bhadradrikottagudem

Khammam kothagudem

Bhadradri kottagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. గొడ్రాలివంటూ కోడలిని అత్తింటి వారు వేధించారు. పిల్లల్ని కనకుంటే ఆమె చెల్లితో పెళ్లి చేయాలని భార్యను భర్త సైతం మనోవేదనకు గురిచేశారు. అంతేకాకుండా ఆమెను పుట్టింట్లో వదిలేసి ఏదోక నిర్ణయం తీసుకోవాలంటూ హుకుం జారీ చేశాడు. దీంతో మనస్తాపంతో ఆమహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం దంతాలతండాకు చెందిన భూక్యా బాబూలాల్‌తో 2022లో మూకమామిడి గ్రామానికి చెందిన రేణుకకు వివాహం జరిగింది. వివాహం జరిగి రెండేళ్లు అవుతున్నా పిల్లలు కాలేదంటూ కోడలు రేణుకను అత్తింటివారు వేధింపులకు గురిచేశారు.

వేరొక వివాహం చేస్తామంటూ బెదిరింపు: 

విడాకులిస్తే తమ కుమారుడికి వేరొక వివాహం చేస్తామంటూ బెదిరించారు. భర్త కూడా రేణుకపై వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. పిల్లల్ని కనకపోతే కనీసం చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతిపాదన పెట్టాడు. వేధింపులు తారాస్థాయికి చేరడంతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మూకమామిడి గ్రామంలోని పుట్టింటికి వచ్చిన రేణుక.. గత నెల 27న పురుగుల మందు తాగింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి రేణుక మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె మృతికి భర్త బాబూలాల్‌, అత్త, మామ కారణమంటూ పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: అతిగా బ్రష్‌ చేస్తే దంతాలకు ప్రమాదమా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు