మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఈక కూడా పీకలేవ్: హరీష్ రావ్ వార్నింగ్ లక్ష తప్పుడు కేసులు పెట్టిన తనను ఏమీ చేయలేరని హరీష్ రావు అన్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాలన్నీ బయటపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. By srinivas 03 Dec 2024 | నవీకరించబడింది పై 03 Dec 2024 15:49 IST in తెలంగాణ మెదక్ New Update షేర్ చేయండి Harish rao: మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి లక్ష తప్పుడు కేసులు పెట్టించినా ఏమీ చేయలేవంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. తనను ఎన్ని రకాలుగా ఇంబ్బందులు పెట్టాలని చూసిన ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపనంటూ సవాల్ విసిరాడు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పంజాగుట్టలో కేసు నమోదైన సందర్భంగా స్పందించిన హరీష్ రావు.. ఇకపై రేవంత్ రెడ్డి నిజ స్వరూపాలన్నీ బయటపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ @revanth_anumula అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,… — Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024 ఇది కూడా చదవండి: భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ నీకు చేతనైంది ఒక్కటే.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేకపోతున్నావ్. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవ్ అంటూ ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ అలాగే సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగనంటూ విరుచుకుపడ్డారు. ఇది కూడా చదవండి: వీరనారి ఐలమ్మ గుర్తుగా.. త్వరలో మహిళా వర్సిటీ బిల్లు! ఇది కూడా చదవండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? #revanth reddy vs harish rao #harish rao warning to Revanth reddy #CM Revanth #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి