ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు: హరీశ్ రావు

హైదరాబాద్‌లోని కోఠిలో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడంపై హరీశ్ రావు స్పందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు పోలీసులతో కొట్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు అన్నారు.

New Update
Harish Rao,,

హైదరాబాద్‌లోని కోఠిలో ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.

ఇది కూడా చూడండి: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తమని అభయహస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 26లో హామి ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీ అమలు చేయాలంటూ ఆశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గమని మండిపడ్డారు. 

Also Read: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసించే హక్కు లేదా? సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్చ లేదా? అని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశా వర్కర్‌ల గౌరవ వేతనం రూ.1500 మాత్రమే ఉండేదని.. కానీ కేసీఆర్ రూ.10వేలకు పెంచి వారి సేవలను గుర్తించి గౌరవించారన్నారు.

Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ.. ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Also Read: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

ఏం జరిగింది?

హైదరాబాద్ కోఠిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్స్‌డ్ జీతాలు డిమాండ్ చేస్తూ కోఠి డిఎంవి కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు. పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించగా.. వారితో వాదనకు దిగారు ఆశా కార్యకర్తలు. ఏసీపీ శంకర్‌ను ఆశా వర్కర్లను చుట్టుముట్టారు. పరిస్థితుల అదుపుతప్పడంతో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేశారు.

ఆందోళనకారులను అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుంటున్న తరుణంలో ఓ మహిళా పోలీస్ అధికారిపై చేయి చేసుకుంది. ఆశావర్కర్లను పోలీస్ వ్యాన్ ఎక్కిస్తుండగా.. అధికారి చెంపపై కొట్టింది మహిళ. అ సన్నివేశం వీడియోలో రికార్డ్.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు