/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/SCHOOL-jpg.webp)
తెలంగాణ ప్రభుత్వం ఒంటిపూట బడి అమలు చేసే తేదీని ప్రకటించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఆఫ్ డే స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు పాఠశాల ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. ఏప్రిల్ 23 వరకు ఇదే సమయంలో పాఠశాల ఉంటుంది. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రమే మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్ష కారణంగా ఎగ్జామ్ సెంటర్స్‌గా ఉన్న పాఠశాలలకు మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్కూల్స్ జరగనున్నాయి. ఎండ తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతుంది. అక్కడక్కడ 37 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Also read: live longer: అందరికన్నా వీళ్లు మూడేళ్లు ఎక్కువ జీవిస్తారు.. ఎందుకంటే?
Follow Us