Guvvala Balaraju : బీజేపీలో చేరుతున్నా.. అధికారికంగా ప్రకటించిన గువ్వల బాలరాజు

అచ్చంపేట బీఆర్‌ఎస్‌ మాజీఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  కాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

New Update
Guvvala Balaraju

Guvvala Balaraju

Guvvala Balaraju : అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  కాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజీనామా చేసిన సమయంలో తనను కాంగ్రెస్‌లోని పలువురు పెద్దలు పిలుస్తున్నారని చెప్పిన బాలరాజు ప్రస్తుతం బీజేపీలో చేరడం గమనార్హం. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ ఆదివారం రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని బాలరాజు ప్రకటించారు. ఈ రోజు బాలరాజు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును కలిశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అచ్చంపేటలో గులాబీ జెండాను గ్రామ గ్రామానికి తీసుకెళ్లానన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నల్లమల్ల గడ్డపైన కాషాయపు జెండా ఎగరవేస్తానని బాలరాజు స్పష్టం చేశారు.

Also read: తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ మాట్లాడుతూ ఈ నెల 10న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ లో చేరుతారని వివరించారు. బాలరాజు తో పాటు చాలా మంది మాజీ ఎమ్మెల్యే లు కాషాయ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు, కేవలం నాయకులు మాత్రమే కాదు యువత, వివిధ రంగాల్లో ఉన్న మేధావులు పార్టీ లోకి రానున్నారన్నారు.మాజీ ఐఎస్ఐ ఐపిఎస్ లు కమలం తీర్థం పంచుకునేందుకు  సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

బీజేపీ లోకి వచ్చే వారంతా బీజేపీ సిద్ధాంతం కొరకు పని చేస్తారని రాంచందర్‌ రావు తెలిపారు. "నా మీద వచ్చే విమర్శలకు నేను బాధపడను. కాయలు కాసే చెట్టుకు ఎక్కువ రాళ్ళు పడతాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ  ఒక శక్తిగా ఎదుగుతుందన్నారు. 2028 నాటికి మా లక్ష్యం చేరుకుంటామన్నారు. పార్టీ లో అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఉండి గొడవలు జరుగుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. కుటుంబం అన్నాక ఇవన్నీ కామన్ అన్న ఆయన రాష్ట్రంలో పార్టీ ఎదుగుతున్నపుడు గొడవలు సహజం అని చెప్పుకొచ్చారు.

Also Read: ముసలోడే కానీ మహానుబావుడు.. నలుగురు అమ్మాయిలతో 21 నెలలు 734 సార్లు!!

గువ్వల బాలరాజు తొలిసారి 2009లో టీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11,820 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో రెండవ సారి ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ‌పై 9,441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి మరోసారి  ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల, చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరడం సర్వత్రా చర్చనీయంశమైంది.

Advertisment
తాజా కథనాలు