TG: ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు..తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ

దీపావళి పండుగ ముందు రోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. 

TELANGANA LOGO
New Update

Government Employees DA: 

ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం విషయంలో తెలంగాణ గవర్నమెంట్ శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా ఉద్యోగుల డీఏను పెంచుతున్నట్టు అనౌన్స్ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు. 

Also Read: Stock Market: రెండు రోజుల ముచ్చటే..మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్

Also read: కొండగట్టులో అఘోరీ.. రేపే ఆత్మార్పణ !

2025 మార్చి 31వ తేదీ లోపు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు డీఏ బకాయిలు 17 సమాన వాయిదాల్లో చెల్లస్తామని ప్రభుత్వం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయనున్నారు.  2025 ఫిబ్రవరి నుంచి 90 శాతం డీఏ.. 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేపడతారు. విశ్రాంత ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Also Read: Iran VS Israel: డేగలా కమ్మేస్తాం..ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ హెచ్చరిక

Also Read: రేవంత్‌ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe