తెలంగాణలో గూగుల్‌ భారీ పెట్టుబడులు.. టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని ఇది మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ కావాడం గమనార్హం. 

eeeetet
New Update

Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే గూగుల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ మేనేజ్‌మెంట్‌ను రేవంత్ రెడ్డి ఒప్పించారు. ఆగస్టు 2024లో గూగుల్‌ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాగా ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుండటం గమనార్హం.

ప్రపంచంలోనే అయిదవది..

ఇక హైదరాబాద్లో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే అయిదవది. కాగా ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది అధునాతన భద్రత, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేస్తుంది. 

Also Read: కూటమి హయాంలో విచ్చలవిడిగా అవినీతి.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు

ప్రభుత్వం ప్రత్యేక చొరవ..

ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్ఈసీని తమ రాష్ట్రంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. హైదరాబాద్లో ఈ సేఫ్టీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో మరోసారి హైదరాబాద్ ప్రపంచంలో మేటీ ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్

గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్‌ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా స్థాయిలో సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంఆ పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యోల  ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Also Read: TG-Ap: 55 సంవత్సరాల తరువాత ఓ రేంజ్‌ లో కంపించిన తెలంగాణ..!

Also Read: వాళ్లిద్దరు ఓకే అంటే కుర్చీ,టెంట్‌ కూడా రెడీ..మంత్రి పయ్యావులు కౌంటర్‌

#google investiment hyderabad #Huge Investments in hyderabad #CM Revanth #google #hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe