/rtv/media/media_files/2025/02/19/KEMuE5NyJ0WUunmk33lt.jpg)
School Holidays
Telangana: సమ్మర్ వచ్చేసింది..భానుడు భగభగమంటున్నాడు. ఇంకా ఏప్రిల్ కూడా రాకముందే మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉద్యోగులు, పనికివెళ్ళేవారు, విద్యార్థులు బయట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఒంటిపూట బడులు అమలు కానున్నట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
మార్చి 15 నుంచి తెలంగాణ లో ఒంటిపూట బడులు...
— Congress for Telangana (@Congress4TS) March 13, 2025
Telangana govt announces half-day school schedule for 2024-2025, from March 15 to April 23. Schools will operate from 8:00 am to 12:30 pm, with Mid-Day Meals.#Telangana pic.twitter.com/g0M5F1tHid
భోజనం తర్వాత ఇంటికి
విద్యాశాఖ ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా జారీ చేసింది. ఒంటిపూట బడుల నేపథ్యంలో పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాల్సిందిగా తెలిపింది. అలాగే 10th పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించింది. మరోవైపు ఆంద్రప్రదేశ్ లోనూ మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు అమలు కానున్నాయి.
Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్