Telangana : విద్యుత్ వినియోగదారులకు శుభవార్త....ఛార్జీల పెంపు లేనట్లే

విద్యుత్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కీలక ప్రకటన చేశాయి. 2025-26 వార్షిక నివేదికను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి.

New Update
 Telangana Electricity Regulatory Commission (TGERC)

Telangana Electricity Regulatory Commission (TGERC)

Telangana : విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు  రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు కీలక ప్రకటన చేశాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి. విద్యుత్ చట్టం ప్రకారం.. మార్చి నెలాఖరులోగా నివేదికపై ప్రజల సమక్షంలో ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది విద్యుత్‌ ద్వారా వచ్చే ఆదాయం కంటే వ్యయం రూ.20,151 కోట్లు అధికంగా ఉంటుందని విద్యుత్‌ పంపిణీ సంస్థలు తమ నివేదికలో తెలిపాయి. అయితే ఈ మొత్తాన్ని రాష్ర్టప్రభుత్వం కేటాయిస్తే వినియోగదారులకు ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదని వివరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాయితీ పద్దు కింద ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాది ఏర్పడబోయే లోటును భర్తీ చేయాలంటే మరో రూ.8 వేల కోట్లు అధనంగా పెంచి రూ.20,151 కోట్లను కేటాయించాల్సి ఉంటుంది.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

గడచిన రెండేళ్ల నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెరగలేదు. దీంతో డిస్కంలకు ఆదాయం పెరగలేదు. కానీ రాష్ర్టంలో విద్యుత్‌ వినియోగం మాత్రం భారీగా పెరుగుతోంది. దీంతో డిస్కంల నిర్వహణ వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఛార్జీల ప్రకారం వచ్చే ఆర్దిక సంవత్సరంలో రూ.45,698 కోట్ల ఆదాయం సమకూరుతుంది.. వ్యయం రూ.65,849 కోట్లకు చేరుతుంది..లోటు రూ.20,151 కోట్ల ఆర్థికలోటు ఏర్పడుతుంది. దీంతో ఆ లోటును ప్రభుత్వం పూరించాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

ఇక డిస్కంల వారిగా చూస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ డిస్కం ఆదాయం రూ.36,277 కోట్లు కాగా... వ్యయం రూ.46,035 కోట్లు ఉంటుందని అంచనా. వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ డిస్కంకి ఆదాయం రూ.9,421 కోట్లు రావొచ్చని, వ్యయం రూ.19,814 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. ఉత్తర తెలంగాణలో వ్యవసాయ బోర్లు, కాళేశ్వరం, పలు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ వినియోగం అధికంగా ఉన్నందున ఆర్థికలోటు ఎక్కువగా ఉంటుందని అంచనా. దీంతో లోటును భర్తీ చేయాలంటే కొంతమేర చార్జీలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడివస్తోంది. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!


కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహజ్యోతి పేరుతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది దానికి రూ.2,400 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఆ ఆదాయాన్ని రాబట్టడానికి స్వల్పంగా ఛార్జీలను పెంచితే బాగుంటుందని డిస్కంలు ప్రతిపాదించాయి. అయితే డిస్కంల ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రజలపై భారం వేయడం వల్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందన్న కారణంతో ప్రభుత్వమే ఆ లోటును భరించాలని నిర్ణయించుకుంది.
అయితే నివేదికకు సంబంధించి ప్రస్తుతం ఈఆర్‌సీ ఛైర్మన్‌ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల నివేదిక పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఆయన విదేశాల నుంచి వచ్చిన తరవాత నివేదికను వెల్లడించి బహిరంగ విచారణ చేస్తామని ఈఆర్‌సీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యుత్ చట్టం ప్రకారం.. మార్చి నెలాఖరులోగా నివేదికపై ప్రజల సమక్షంలో ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు