/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
GoldRate: బంగారం అనగానే ఇష్టపడని భారతీయులు ఉండరు. ఒకరకంగా బంగారం మన భారతీయ సంస్కృతిలో ఒకభాగంగా మారిపోయింది. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే చలిచమటలు పడుతున్నాయి. కానీ శుభాకార్యాలకు బంగారం తప్పనిసరి. అది పెళ్లి అయిన, ఇతర ఏ ఫంక్షన్ అయిన బంగారం లేకుంటే కుదరదు. దీంతో ఎంత ధర ఉన్నా కొనాల్సిన పరిస్థితి. లక్ష మార్కు దాటిన బంగారం ధర ఇటీవల తగ్గుతూ పెరుగుతూ జనాల్లో ఆశపుట్టిస్తోంది.
కాగా హైదరాబాద్‌లో నిన్న 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 91,300 లు,..24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.99,600 లు, 18 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.74,700 లు పలికింది.అయితే, గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు నేడు తగ్గాయి.
Also Read: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
కాగా నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.99,590 లు,22 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.91,290 లు, 8 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.74,690 లుగా ఉంది. ఈ ధర సాయంత్రానికి మరింత పెరగడం లేదా తగ్గడం జరగొచ్చు.
Also Read: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా
ఇక వెండిధరలు కూడా బంగారంతో పోటీ పడుతూ పెరుగుతూనే ఉన్నాయి. మే నెల చివరి వారం వరకు వెండి ధరలు తగ్గుదల నమోదు చేసుకోగా, జూన్ ప్రారంభం నుంచి వెండి ధరలు మరింత పెరుగుతున్నాయి. నిన్న హైదరాబాద్ లో 100 గ్రాముల వెండి ధర రూ.10,700 గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,07,000లుగా ఉంది. ఇక ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు రూ.10,710 లకు చేరుకుంది. కేజీ వెండి ధర 1,07,100లకు చేరుకుంది.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Also Read : వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు