/rtv/media/media_files/2025/06/07/FEzoBIh0bPn5Adk9LKA0.jpeg)
telangana cabinet
తెలంగాణ మంత్రివర్గ విస్తరన దాదాపు ఖరారైంది. ఫైనల్ లిస్ట్‌లో పేర్లు కూడా బయటకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నలుగురు మంత్రులను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగు అనుకున్న వారిలో కొందరికి చోటు దక్కలేదు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావుకు మంత్రి పదవి దక్కలేదు. మాల సామాజికవర్గం నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కేబినెట్‌లో బెర్త్ దక్కింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రేపు ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే ప్రకటించనున్నారు.
అలాగే మాదిగ సామాజికవర్గం నుంచి కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. (BC) ముదిరాజ్ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. మైనార్టీ నుంచి MLC అమీర్ అలీఖాన్‌కు మంత్రివర్గంలో చోటు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్నో రోజులుగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజ్ గోపాల్ రెడ్డి పేరు వినబడట్లేదు. అంతేకాదు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ విజయ శాంతి, అద్దంకి దయాకర్ లు కూడా మీనాక్షీ నటరాజన్‌ను కోరారు. అయితే వారి కూడా మంత్రి పదవి దక్కనట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం అధికారికంగా నలుగురు మంత్రుల పేర్లు ప్రకటించనున్నారు. అయితే లాస్ట్ నిమిషానికి కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఇంకెవరి పేర్లు అయినా సూచించవచ్చ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.
telangana-cabinet | new-ministers | Telangana Cabinet New Ministers List | | New Ministers in Telangana Cabinet | congress | telugu-latest-news