/rtv/media/media_files/2025/02/23/tZrKQO548utqwINJ4smg.jpg)
Foreigners
Foreigners in wedding : సిద్దిపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకలో విదేశీయులు సందడి చేశారు. తోషిబా కంపెనీకి చెందిన జపాన్ దేశీయులతో పాటు యూరప్ లోని ఫిన్లాండ్ కు చెందిన యువజంట కూడా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా ఆడుతూ సందడి చేశారు.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!
సిద్దిపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఓ వివాహ మహోత్సవంలో విదేశీయులు సందడి చేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కొత్త రాజశ్రీ శ్రీనివాస్ దంపతుల కుమార్తె రోహిణి వివాహం హుజురాబాద్ పట్టణానికి చెందిన పోతిరెడ్డి శ్రీనివాస్ జానకి దంపతుల కుమారుడు రాహుల్ తో జరిగింది. పెళ్లి కుమారుడు రాహుల్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి కుమారుని తండ్రి పోతిరెడ్డి శ్రీనివాస్ హైదరాబాదు పటాన్ చెరులోని ప్రముఖ ఎలక్ట్రికల్ సంస్థ విజయ్ ఎలక్ట్రికల్స్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. విజయ్ ఎలక్ట్రికల్స్ జపాన్ లోని ప్రసిద్ధ తోషిబా కంపెనీకి అనుబంధంగా పనిచేస్తోంది.
Also Read: తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్..ఎప్పటినుంచంటే...
దీంతో శ్రీనివాస్ ఆహ్వానం మేరకు తోషిబా కంపెని ప్రతినిధులు జపాన్ నుండి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే యూరప్ లోని ఫిన్లాండ్ కు చెందిన యువజంట కూడా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి.. వివాహ వేడుకలో దాండియా ఆటపాటలతో సందడి చేశారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు వివాహ పద్ధతి తమకెంతో నచ్చాయని, ఆకట్టుకున్నాయని వారన్నారు. ఇక్కడి వివాహ పద్ధతి తమను మంత్రముగ్ధులను చేశాయన్నారు. ఈ అనుభూతులను ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. ఈ వివాహం సిద్దిపేటలోని విఎస్ ఎస్ గార్డెన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున ప్రముఖులు ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Bird flu: ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. 95 గ్రామాల్లో పిట్టల్లా రాలిపోతున్న నాటు కోళ్లు!
Also Read: మవోలకు మరో దెబ్బ.. భారీ డంప్ స్వాధీనం.. పోలీసుల చేతికి కీలక సమాచారం!