Hyderabad: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మేడ్చల్ పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పత్తి అంటుకుని పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: TG: ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి: సీఎం రేవంత్ సవాల్
రూ.కోట్లలో నష్టం..
అయితే పరిసర ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ మంటల కారణంగా గోదాం కుప్పకూలింది. రూ.కోట్లలో నష్టం జరిగినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. ఈ ఘనటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్‌పై దాడి.. పాదయాత్రలో కలకలం!