కేజ్రీవాల్‌పై దాడి.. పాదయాత్రలో కలకలం!

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ పై దాడి జరిగింది. గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి లిక్విడ్ పోశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

author-image
By srinivas
New Update
kejri

Delhi: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ పై దాడి జరిగింది. గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి లిక్విడ్ పోశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఉలిక్కపడ్డ కేజ్రీవాల్.. 

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కేజ్రీవాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెక్యూరిటి అతన్ని చుట్టిముట్టి సురక్షితంగా ముందుకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు ముందే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్.. ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని, దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆయన కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం సంచలనం రేపుతోంది.

పోలీసులపై కఠిన చర్యలు..

ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ చెప్పారు. ఢిల్లీలోని వికాస్‌పురిలో అరవింద్ పాదయాత్ర చేస్తుండగా.. కొందరు ఆయన దగ్గరికి వచ్చారని.. దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని సంచలన ఆరోపణలకు తెర తీశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇక బీజేపీ రాజకీయాలు ఎంత నీచానికి దిగజారిపోతాయో ఈ ఘటనతో ఢిల్లీ ప్రజలు చూశారని అతిశీ అన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేమని బీజేపీకి తెలుసని.. అందుకే పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు గుప్పించారు. 

Advertisment
తాజా కథనాలు