హైదరాబాద్- విజయవాడ హైవేలో ప్రయాణం అంటే ట్రాఫిక్‌తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అయితే త్వరలోనే ఈ సమస్యలు తీరనున్నాయి. ఈ రహదారిని 6 లేన్లుగా నిర్మించాలని కోరుతూ గతంలో రాష్ట్ర సర్కార్ నివేదిక పంపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.541 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మొత్తం 25 కిలోమీటర్ల వరకు రోడ్‌ను విస్తరించనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 8 ఫ్లైఓవర్లను సైతం నిర్మిస్తున్నారు. అలాగే వీటి సమీపంలో సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: వ్యక్తి ఖాతాలో పొరపాటున పడ్డ రూ.16 లక్షలు.. చివరికి ఊహించని షాక్
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 6 లేన్లు
వాస్తవానికి ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు కొన్ని ప్రాంతాల్లో 6 లేన్ల రహదారి కూడా ఉంది. కానీ మరికొన్ని చొట్ల మాత్రం కేవలం 4 లేన్ల రోడ్డు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు 25 కిలోమీటర్ల వరకు మొత్తం 6 లేన్ల రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ మధ్య 8 ఫ్లై ఓవర్లు రానున్నాయి. వనస్థలిపురం, పనామ, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, కోహెడ జంక్షన్, కవాడిపల్లి జంక్షన్, అబ్దుల్లాపూర్ మెట్, ఇనాంగూడ, బాట సింగారంలో ఈ ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు.
Also Read: భాగమతి రైలు ప్రమాదంపై.. దక్షిణ రైల్వే కీలక ప్రకటన
రెండు ఫ్లైఓవర్లు తుది దశకు
అయితే హయాత్‌నగర్ దాటిన తర్వాత ఫ్లై ఓవర్లు పూర్తి కాగా.. ప్రస్తుతం వాటి నుంచి వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని వాహనాదారులు చెబుతున్నారు. అలాగే హయత్‌నగర్ దగ్గర్లో నిర్మిస్తున్న మరో రెండు రెండు ఫ్లైఓవర్లు సైతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులో వాటిని ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు.
Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి నో టోల్ ఫీజు!
ఏళ్లుగా పెండింగ్‌లో ప్రాజెక్టు
మరో విషయం ఏంటంటే ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్‌కు రహదారిని విస్తరించాలన్న ప్రపోజల్ గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది. అయితే గతంతో ఎంపీలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమర్ రెడ్డి ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని గతంలో లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. అలాగే కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి కోరారు. దీంతో 2021లో ఆ ప్రాజెక్టు మంజూరైంది. ఇప్పటికే ఇది పూర్తి కావాలి. కానీ కరోనా వల్ల రెండు దశల పనులకు బ్రేక్ పడింది. ముందుగా ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు 8 లేన్ల వరకు విస్తరించాలని అధికారులు యోచించారు. ఆ తర్వాత 6 లేన్లకు ప్రతిపాదనలను రూపొందిచారు.
Also Read: Bishnoi Gang సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే?
హైదరాబాద్ - విజయవాడ మార్గం కేంద్ర ప్రభుత్వ కంట్రోల్‌లోనే ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉంది. ఎల్బీనగర్ నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు ఆర్ అండ్ బీలోని ఎన్‌హెచ్‌ఏఐ సెక్షన్ పరిధిలో ఉంది. ఈ రహదారిని విస్తరించినప్పుడు 2010లోనే హైదరాబాద్- విజయవాడ మర్గాన్ని 8 లేన్లకు విస్తరించాలనే ప్రతిపాదన వచ్చింది.ఇందుకోసం భూసేకరణ కూడా జరిగింది. కానీ పలు కారణాల వల్ల అడుగులు ముందుకు పడలేదు. అయితే తాజాగా రహదారి విస్తరణకు పలుచోట్ల తప్పించి అంతగా ఇబ్బందులు రాలేవని అధికారులు తెలిపారు. మరో 6 నెలల్లో ఇవి పూర్తవుతాయని చెబుతున్నారు.