మా ఫాం హౌస్‌లు ఎక్కడున్నాయో చూపించండి.. రేవంత్‌కు సబితా సవాల్

సీఎం రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫాంహౌస్‌లు కూల్చాలా ? వద్దా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సబితా స్పందించారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి.. మిగతా మూడు ఫాంహౌస్‌లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండి అంటూ సవాల్ విసిరారు.

New Update
sabitha

సీఎం రేవంత్ రెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫాంహౌస్‌లు కూల్చాలా ? వద్దా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సబితా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆత్మాభిమానం కన్నా మించిన ఆస్తి మరోకటి లేదని నమ్మిన వ్యక్తినని తెలిపారు. ముఖ్యమంత్రి గానీ, ఇతర వ్యక్తుల ముందుగాని పేద ఏడుపులు ఏడ్చిన సందర్భం నాకు దేవుడు కలిగించలేదని పేర్కొన్నారు. సీఎంను, ఆయన మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి.. మిగతా మూడు ఫాంహౌస్‌లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టండి అంటూ సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా టార్గెట్‌ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు