BRSతోనే బాగుంది.. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇంద్రకరణ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వదిలిపెట్టినందుకు తనకు బాధగా ఉందన్నారు. కాంగ్రెస్‌ సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో తాను యాక్టివ్‌గా లేనన్న ఆయన..  కాంగ్రెస్ పనుల గురించి ప్రజలతో చెప్పుకోలేకపోతున్నానన్నారు.

New Update
indrakaran reddy

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వదిలిపెట్టినందుకు తనకు బాధగా ఉందన్నారు. కాంగ్రెస్‌ మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో తాను యాక్టివ్‌గా లేనన్న ఆయన..  కాంగ్రెస్ పనుల గురించి ప్రజలతో చెప్పుకోలేకపోతున్నానని అన్నారు. కోనేరు కోనప్పను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది వాస్తమేనన్న ఆయన..  బీఆర్ఎస్‌ హయాంలో యూరియా కొరత లేదని వెల్లడించారు. ఇంద్రకరణ్‌ రెడ్డి తాజా కామెంట్స్ తో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం అవుతోంది.  

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 1980ల ప్రారంభం నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 1991లో టీడీపీ అభ్యర్థిగా ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2009 వరకు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో ఉపఎన్నికల తర్వాత 14వ లోక్ సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 2014లో బీఎస్పీ అభ్యర్థిగా నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచారు.

కేసీఆర్ తొలి మంత్రివర్గంలో

2014లో బీఎస్పీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో చేరారు. కేసీఆర్ తొలి మంత్రివర్గంలో దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.2018లో మళ్ళీ నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి, కేసీఆర్ రెండో మంత్రివర్గంలో దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisment
తాజా కథనాలు