/rtv/media/media_files/2025/12/05/kcr-2025-12-05-19-33-44.jpg)
KCR
BIG BREAKING: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్‌లను తన ఫామ్ హౌస్‌కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు. గ్రామాల్లో ఎన్నికల తీరుపై కూడా కేసీఆర్ ఆరా తీశారు. వచ్చేది మన ప్రభుత్వమేనని భరోసా ఇచ్చారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని.. కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడొద్దని సూచనలు చేశారు. గ్రామాలకు మళ్లీ మంచిరోజులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు.
Also Read: శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్ ఏం జరగబోతుంది?
ఇదిలాఉండగా సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11,14, 17 తేదీల్లో మూడు దశల్లో జరగనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్‌గా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించారు. పలు గ్రామాల్లోని ప్రజలు సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వీటినుంచి వచ్చిన డబ్బులను తమ గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని స్థానికులు చెబుతున్నారు.
Follow Us