KCR Birthday : భీమ్లానాయక్ లో కేసీఆర్ కు ఎలివేషన్... అభిమానుల పండుగ....సోషల్ మీడియాలో వైరల్

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, పార్టీ నాయకులు, కేసీఆర్ అభిమానులు సోషల్‌ మీడియాలో కేసీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

New Update
HBD KCR

HBD KCR

KCR Birthday :  బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు రాష్ర్ట వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో కేసీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా కేసీఆర్‌ కు పర్సనల్‌గా, సోషల్‌ మీడియాలో బర్త్‌ డే విషెస్‌ చెప్పి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ పేరు ఉన్న సినిమా సీన్స్‌ కూడా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. అయితే అందులో పవన్‌ కళ్యాణ్‌, రానా నటించిన భీమ్లానాయక్‌ చిత్రం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

Also Read: Gold Prices: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త...వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు!


 ఈ చిత్రంలో రానాను పోలీస్‌ అధికారి అయిన పవన్‌కళ్యాణ్‌ అరెస్ట్‌ చేస్తాడు. ఆ సమయంలో రానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని పవన్‌ కళ్యాణ్‌ తన సిబ్బందిని కోరుతాడు. అదే సమయంలో రానాకు సంబంధించిన ఫోన్‌లో ఆధారాలకోసం కానిస్టేబుల్‌ వెతుకుతున్నాడని చెప్తారు. ఆ సమయంలో భట్టివిక్రమార్క పేరు ఆ పోన్‌లో ఉంటుంది. కానిస్టేబుల్‌ ఆ పేరు చదవగానే ఎవరు సార్‌ ఆయన అని మరో కానిస్టేబుల్‌ అడుగుతాడు. కాంగ్రెస్‌ పార్టీ అపొజిషన్‌ లీడర్‌ అని సమాధానం ఇస్తాడు. అంటే పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందన్నమాట సార్‌కు అంటాడు.

ఇది కూడా చదవండి: TG New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

కాగా ఈ మొగొళ్లంతా ఎందుకు సార్‌ కీర్తి సురేష్‌ పేరు ఉందో చూడమంటాడు. అప్పుడు అతను కీర్తి అంటే కే నే కదా అని కే మీదా ఉన్న పేర్లు చదువుతుంటాడు.ఇక జీఎంఆర్‌, కేటీఆర్‌ పర్సనల్‌ అని చదివి లేచి నిలబడతాడు. మిగిలిన వారు ఏమందయ్య అందులో అంటాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్‌ కేసీఆర్‌ అంటాడు. అంతే ఈ సీన్‌లో కేసీఆర్ పేరు వినగానే ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన నెటిజన్లు గూస్ బంప్స్ ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం సీన్ ను కేసీఆర్‌ అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు షేర్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Also Read: Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!

Advertisment
తాజా కథనాలు