/rtv/media/media_files/2025/01/27/vXn5NZjCnaMSuJAWf8PM.jpg)
Mid Day Meals
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్నాహ్న భోజన పథకంపై విద్యా కమిషన్.. ప్రభుత్వానికి కీలక నివేదిక అందజేసింది. ఈ స్కీమ్‌లో మరికొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్రంలో పలు ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వరుసగా పుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీటిని దృష్టిలో ఉంచుకుని.. అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను విద్యా కమిషన్ సందర్శించింది.
Also Read: నా భార్య కొడుతుంది.. నన్ను క్షమించు నాన్న: భార్య వేధింపులకు మరో భర్త బలి!
వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు, ఫుడ్ క్వాలిటీ, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను కమిషన్ పరిశీలించింది. చివరికి ఓ నివేదికను రూపొందించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు నివేదికను అందజేశారు. అయితే ఈ రిపోర్టులో ప్రధానంగా మధ్యాహ్న భోజన స్కీమ్‌కు సంబంధించి మెనూలో చేయాల్సిన మార్పులపై పలు కీలక సూచనలు చేసింది.
Also Read: 'గంగా నదిలో మునిగితే పేదరికం పోతుందా, మోదీ, అమిత్ నరకానికే పోతారు': మల్లికార్జున ఖర్గే
ప్రతీవారం పాఠశాలలకు బిల్లులు చెల్లించాలి. ఇంటర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులకు అవసరమైన కాస్మోటిక్స్, ఇతర సామాగ్రిని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచే కొనాలి. ఇలాంటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ వల్ల విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించవచ్చని'' విద్యా కమిషన్ నివేదికలో తెలిపింది.
Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?