Karthikamasam :ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే! ఈ కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక దీపం వెలిగిస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయనే నమ్మకం ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 09 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Karthika masam: హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో శివకేశవ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ నెలలో హిందువులు ఆధ్యాత్మిక సాధన, దీపారాధన, దీప దానం, జపం, స్నానం, దానం, ఉపవాసం వంటి కార్యక్రమాలు చేస్తూంటారు. Also Read: KL Rahul: ఎట్టకేలకు తండ్రి కాబోతున్న భారత క్రికెటర్.. పోస్ట్ వైరల్! అంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక దీపం వెలిగిస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయనే నమ్మకం ఉంది. అయితే ఇంతటి మహిమ కలిగిన ఈ ధనదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? ఏ విధమైన పూజలు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. ఈ పవిత్రమైన, శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగించే ముందు ఇంట్లోని పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. అనంతరం శ్రీమహాలక్ష్మి దేవి చిత్రపటానికి గంధం, కుంకుమ, పసుపుతో కలిపిన బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి చిత్రపటం ముందు శుభ్రంగా కడిగిన ఒక పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం ఆ పీఠానికి పసుపు, కుంకుమ, గంధంతో కలిపిన బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఆ పీఠంపై ఒక ఇత్తడి పళ్లెంను ఏర్పాటు చేసుకోవాలి. Also Read: చంద్రబాబు సంచలనం.. 20 మంది డీఎస్పీలపై బదిలీ వేటు! ఆ పళ్లెంకు కూడా పీటకు మాదిరిగానే పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టుకోవాలి. అనంతరం అందులో గుప్పెడు బియ్యం వేసుకొని.. అందులో పసుపు, కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక గులాబీ పువ్వు వేసుకుంటే మంచిది. ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలను తీసుకోవాలి. అందులో ఒక ప్రమిదలో మూడు యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని బియ్యం ఉన్న పళ్లెంలో పెట్టుకోవాలి. Also Read: నెక్స్ట్ సీఎం అతనే.. రేవంత్ ముందు కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు! ఇప్పుడు ఇంకో ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిదపై ఉంచాలి. అనంతరం ఆ పై ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసుకొని, అందులో రెండు ఒత్తులు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఒత్తులను అగరబత్తి హారతితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అని పిలుస్తారు. ఈ దీపాన్ని కార్తీకమాసంలో ఏ రోజు అయినా వెలిగించుకోవచ్చు. కాకపోతే గురు, శుక్రవారాల్లో వెలిగించుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందొచ్చని పండిత నిపుణులు చెబుతున్నారు. Also Read: పవన్ నన్ను క్షమించండి.. ఇంకెప్పుడు అలా చేయను: శ్రీరెడ్డి మరో సంచలనం! రెండో ప్రమిదలో దీపం వెలుగుతున్న సమయంలో జవ్వాది అనే సుగంధ ద్రవ్యం అందులో వేసుకోవాలి. దీపం కొండెక్కిన తరువాత మొదటి ప్రమిదలో ఏలకులు, లవంగాలు, రాళ్ళ ఉప్పు, పళ్ళెంలోని గులాబీ పువ్వును ఎవరూ తొక్కని చోటులో వేసుకుంటే మంచిది. పళ్ళెంలోని గులాబీ పువ్వును పడేశాక అందులోని బియ్యంతో పాయసం లేదా నైవేద్యం చేసి లక్ష్మీదేవికి సమర్పించే మంచి ఫలితాలను పొందొచ్చట. అయితే ఈ దీపం వెలిగించే ముందు బియ్యం పళ్లెంలో ఒక రూపాయి బిళ్ళను వేసుకోవాలి. అలా అంతా పూర్తయిన తరువాత ఆ బిళ్ళను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి.. డబ్బులు దాచుకునే బీరువాలో ఆ బిళ్ళను పెడితే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుందని నమ్మకం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి