Aarogyasri card : ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అయితే ఈ శుభవార్త మీ కోసమే

తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రేవంత్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలోకి మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కార్డుదారులకు మరింత వెసలుబాటు కలిగే అవకాశం ఉంది.

New Update
Aarogyasri card

Aarogyasri card

Aarogyasri card : తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు రేవంత్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలోకి మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రులను చేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనివల్ల కార్డుదారులకు మరింత వెసలుబాటు కలిగే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులుండగా, ఇందులో 409 ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి. దీనికి తోడు  ఈ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులను చేర్చేందుకు రేవంత్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీంతో వాటి సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా 164 హాస్పిటల్స్‌లో రోగులకు ఎలాంటి రుసుము లేకుండా చికిత్స అందించనున్నారు. ఇక ఆరోగ్యశ్రీ ఖర్చును కూడా ప్రభుత్వం పెంచింది.ప్రభుత్వం చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచడంతోపాటు మొత్తంగా 1,835 వ్యాధులను చేర్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 2024---25లో 3.53 లక్షల మంది రోగులు చికిత్స చేయించుకున్నారు.

Also Read:ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

మరోవైపు తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 2025 నుంచి 70 ఏళ్లు పైబడిన వారికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. ఆధార్ కార్డులో వయసు ఉంటే చాలు, ఈ పథకానికి అర్హులు. ఆరోగ్య శ్రీ, PMJAY ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కీమ్ ద్వారా వృద్ధులకు ఉచిత వైద్యం అందుతుంది. ట్రీట్‌మెంట్, సర్జరీలు, హాస్పిటాలిటీ, మెడిసిన్ ఖర్చులన్నీ కలిపి రూ. 5 లక్షల వరకు ఉచితంగా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా, కేవలం వయసు ఆధారంగా ఈ పథకం వర్తిస్తుంది.

Also Read: 🔴Live News Updates: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ (CGHS) లేదా ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఆయుష్మాన్ వయో వందనకు అర్హులే. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందవచ్చు. దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ స్కీమ్ కు వయసు మాత్రమే ముఖ్యమైన అర్హత. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి అర్హులు.

Also Read: Ap Weather Report: నేడు 126 మండలాల్లో తీవ్ర వడగాలులు...హెచ్చరికలు జారీ !

Advertisment
తాజా కథనాలు