BJP Leader Raja Singh
వీధుల్లో ప్రజల జీవితానికి అంతరాయం కలిగించే మతపరమైన ఆచారాలను అనుమతించొద్దనిహైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను బీజేపీ నేత రాజాసింగ్ కోరారు. రోడ్లను మతపరమైన ఆచార స్థలాలుగా మార్చడాన్ని తాము అంగీకరించమని చెప్పారు. రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజల్ని అనుమతిస్తే...తాము హనుమాన్ చాలీసా చదువుతామని వార్నింగ్ ఇచ్చారు.
ఇలాంటి మతపరమైన చర్యలు సాధారణ ప్రజలకు అనవసరమైన ఆటంకాలను, అవాంతరాలను మాత్రమే సృష్టిస్తుందని రాజాసింగ్ అన్నారు. ఏ సమూహం కూడా ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా, రోడ్లు అందరికీ స్పష్టంగా, శాంతియుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. గతంలో పలు రాష్ట్రాల్లో రోడ్లపై నమాజ్ చేయడం వివాదాలకు దారి తీసింది. దీనికి ప్రతిచర్యగా మరో వర్గం రోడ్లపైకి వచ్చి హనుమాన్ చాలీసాను పఠించారు.
Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!
Also Read: Air India: థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు..80 గంటలుగా అక్కడే..
Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!