/rtv/media/media_files/2025/02/04/LsjEEaO2Dg5NleXzbBeW.jpg)
Producer Dil Raju
Producer Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు దిల్ రాజు. డాక్యుమెంట్స్, బ్యాంకు వివరాలతో ఐటీ కార్యాలయానికి విచారణకు వచ్చారు.
గత నెలలో దిల్ రాజుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, ఆఫీసుల్లో ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.దిల్ రాజు కూతురు, అలాగే సోదరుడు శిరీష్ ఇళ్లలో, ఆఫీసుల్లో విస్తృత తనికీలు నిర్వహించారు. సినిమాలు, వ్యాపారాలకు సంబంధిన లావాదేవీలను పరిశీలించారు. అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివారాలు తీసుకొని రావాలని దిల్ రాజుకు నోటీసులు ఇచ్చారు. దీంతో దిల్ రాజు మంగళవారం ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లారు. తమ వ్యాపారాలకు సంబంధించిన వివరాలతో ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?
2023 నుంచి 2025 వరకు సినీ నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడులు, వచ్చిన ఆదాయాలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకురావాలంటూ ఐటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐటీకార్యాలయానికి వచ్చిన దిల్‌రాజు విచారణను ఎదుర్కుంటున్నారు. వచ్చిన ఆదాయానికి, చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలు, అనుమానాలతో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపైనా దృష్టి పెట్టారు ఐటీ అధికారులు. గత రెండేళ్లుగా దిల్‌రాజు బ్యానర్‌లో నిర్మించిన సినిమాలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టారు. దిల్ రాజుతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: సౌకర్యవంతమైన నిద్ర కోసం 7 సాధారణ చిట్కాలు
ఇటీవల తనిఖీల సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ కేవలం తనను టార్గెట్ చేస్తూ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఐటీ సోదాలనేవి కొత్తవేం కాదని, ఐటీ సోదాలు చేసినంత మాత్రాన నేరం చేసినట్టు కాదని వివరించారు. నాలుగు రోజులపాటు చేసిన సోదాల్లో కేవలం 20 లక్షల లోపే డబ్బు బయటపడిందని తెలిపారు. గతంలో 2008లో ఒకసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని, మళ్లీ 16 ఏళ్ల తర్వాత తనిఖీలు చేశారని అన్నారు.
ఇది కూడా చదవండి: పురుషులు ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించవద్దు