/rtv/media/media_files/2025/10/30/abhishek-bachchan-2025-10-30-09-37-02.jpg)
Abhishek Bachchan
Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ''అవార్డులు కొనుక్కుంటారు'' అంటూ వస్తున్న విమర్శల పై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే అభిషేక్ బచ్చన్ ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రంలో ఉత్తమ నటనకు గానూ ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఈ క్రమంలోఓ సినీ క్రిటిక్ అభిషేక్ అవార్డు గెలుచుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అవార్డులు కొనుక్కుంటారు, ఎవరూ చూడని సినిమాకు ఈ అవార్డును గెలుచుకున్నారని ఆరోపించారు.
అవార్డులు కొనుక్కుంటారు!
దీంతో ఈ విమర్శలపై అభిషేక్ స్పందిస్తూ.. సదరు వ్యక్తికి తన స్టైల్లో గట్టిగా బదులిచ్చారు. మీకు సూటిగా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పటివరకూ నేను ఒక్క అవార్డు కూడా కొనలేదు, అలాగే నాకోసం ఎలాంటి పీఆర్ లు పనిచేయడం లేదు. కేవలం కస్టపడి పనిచేయడం, చెమట చిందించడం, కన్నీళ్లే మాత్రమే నాకు తెలుసు. అయినా... నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు! కానీ, మీ నోరు మూయించడానికే సరైన మార్గం ఏంటో నాకు తెలుసు. భవిష్యత్తులో నేను ఇంకా కస్టపడి పనిచేస్తాను, నా విషయంలో మీరు అనుకున్నది తప్పని నిరూపిస్తా. ఇది ఎంతో గౌరవ భావం, స్నేహపూర్వకంగా చెబుతున్నాను అంటూ బదులిచ్చారు అభిషేక్.
Also Read: Baahubali The Eternal War: థర్డ్ సర్‌ప్రైజ్ ఉంది... 'బాహుబలి 3' పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి
Follow Us