త్వరలో కాలుష్యరహిత 20 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి: భట్టి

తెలంగాణలో కాలుష్యరహితంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు యత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి ఆయన ప్రారంభించారు.

batti 2
New Update

తెలంగాణలో ప్రకృతి వనరులను ఉపయోగించుకొని కాలుష్యరహితంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు యత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగానేనని పేర్కొన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తికి పైలట్ ప్రాజెక్టు కింద త్వరలోనే గ్రామాలను కూడా ఎంపిక చేస్తామని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మంత్రులు భట్టితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.  

Also Read: హైదరాబాద్‌లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా?

ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇది మొదటి విజయదశమి. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందేలా ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. గత బీఆర్‌ఎస్ పార్టీ పాలకులు అరకొర రుణమాఫీలు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు మాపై దుష్ర్పచారాలు చేస్తున్నారు. ఏ వెసులుబాటు ఉన్నా కూడా మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేస్తాం. ఇక భవిష్యత్తులో రైతులకు పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని'' పేర్కొన్నారు.  

 

#batti-vikramarka #tummala-nageshwar-rao #power-plant #minister-ponguleti
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe