HYDERABAD: తండ్రి చేసిన పనికి.. కూతురు సెల్ఫీ సూసైడ్.. వీడియో వైరల్!

తండ్రి చేసిన తప్పుకు కూతురు బలైన ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో జరిగింది. సంగీత్‌రావు ఉద్యోగం పేరుతో కానిస్టేబుల్ వద్ద రూ.15లక్షలు తీసుకుని ఇప్పించలేదు. దీంతో అతడితోపాటు కూతురిపై కేసు నమోదైంది. ఆమెను డబ్బుల కోసం వేధించడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Father Daughter Incident In Nacharam

Father Daughter Incident In Nacharam

తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం పోలీసులు తరచూ తనను వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని మరీ ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్ నాచారంలోని బాపూజీనగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఆమె తండ్రి సంగీత్ రావు ఐఐసీటీలో చాలా ఏళ్లు వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. అయితే సంగీత్ రావుకు బెల్ల అనిల్ అనే కానిస్టేబుల్‌తో కాస్త పరిచయం ఉంది. ఈ క్రమంలోనే అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీత్ రావు అన్నాడు. 

ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!

ఉద్యోగం పేరుతో రూ.15 లక్షలు

దీంతో రెండేళ్ల క్రితం కానిస్టేబుల్ అనిల్ నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని సంగీత్ రావు కూతురు దీప్తిని తరచూ అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని.. ఆయన తమతో చాలా ఏళ్లనుంచి కలిసి ఉండటం లేదని దీప్తి చెప్పుకొచ్చింది. అనిల్ అదంతా పట్టించుకోకుండా తన భార్య అనితతో నాచారం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు.

ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...

దీంతో దీప్తి, సంగీత్ రావు మీద ఛీటింగ్ కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే అనిల్‌కి రూ.8 లక్షలు తిరిగి ఇచ్చినట్లు దీప్తి కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ డబ్బుల కోసం తన కూతురు దీప్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తప్పుడు కేసులు పెట్టారని సంగీత్ రావు ఆరోపణలు చేశారు. మరోవైపు కేసు విత్ డ్రా చేసుకోవాలంటే రూ.35 లక్షలివ్వాలని అనిల్ మామ సోమయ్య, భార్య అనిత, అనిత సోదరుడు సైదులు దీప్తిని డిమాండ్ చేసినట్లు సమాచారం.

ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం

ఇక ఆమె ఎంత చెప్పినా వినకుండా కేసులు పెట్టి పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలిచి అనిల్ బెదిరించినట్లు దీప్తి వీడియోలో పేర్కొంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై దీప్తి రీసెంట్‌గా తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటానికి పోలీసులు వేధింపులే కారణమని ఆరోపిస్తూ మొబైలో వీడియో రికార్డ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు