Watch Video: ఛీ ఛీ.. మామపై కోడలు అరాచకం.. వీల్‌చైర్‌పై ఉండగానే

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధుడైన మామ పై అతడి కోడలు విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్ చైర్‌లో ఉన్న మామ ముఖంపై పదే పదే చెప్పుతో దాడి చేసింది. వద్దు వద్దు అని కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలు కనికరించలేదు.

New Update
Nalgonda

ఈ సమాజం ఎటు పోతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు. వయసు మళ్లిన వారిని కంటికి రెప్పలా కాపాడుకోవలసింది పోయి.. వారిపైనే దాడికి దిగుతున్నారు. అదీ సొంత ఇంట్లో వారే దాడి చేయడం హృదయాన్ని కలచివేస్తోంది. 

ఇది వరకు చాలా వీడియోలు చూశాం. కన్న కొడుకులే తల్లి దండ్రులను రోడ్లపై వదిలేసి వెళ్లిపోవడం. మరికొందరేమో ఆస్తి కోసం కొట్టడం.. ఇంకొందరు పెళ్లి చేయడం లేదని, ఇలా రకరకాల కారణాలతో సొంత తల్లిదండ్రులను కన్న కొడుకులు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అది సొంత కొడుకులు, కూతుర్లు కాదు. ఒక కోడలు తన మామపై దాడి చేసింది. మామ పై విచక్షణారహితంగా చెప్పుతో దాడి చేసింది. వీల్ చైర్‌పై లేవలేని స్థితిలో ఉన్నా.. ఆ కోడలు కనికరించలేదు. 

ఏకంగా చెప్పుతో మామ ముఖంపై పదే పదే దాడి చేసింది. కాళ్లు పట్టుకొని వేడుకున్నా ఆ కోడలి మనసు కరగలేదు. ఈ ఘటన నల్గొండ - వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

మరో హృదయవిదారక ఘటన

డబ్బు కోసం కన్న బిడ్డలనే అమ్మేసిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. ఆర్మూర్‌లోని మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఏడేళ్ల కుమారుడుతో పాటు ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కవలలు ఉన్నారు. భాగ్యలక్ష్మీ ఈ ముగ్గురు పిల్లల్ని 10 నెలల కిందట డబ్బు కోసం ఇతరులకు విక్రయించింది.

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

డబ్బు కోసం ముగ్గురు వ్యక్తులకు..

నిజమాబాద్ జిల్లా సుర్భిర్యాల్‌కు చెందిన గంగాధర్‌కి రూ.లక్షకు, భీమ్‌గల్ మండలానికి చెందిన నర్సయ్యకు రూ.1.2 లక్షలకు, జగిత్యాల జిల్లాలోని వనజ అనే ఆమెకు రూ.2 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం అందడంతో ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మీని విచారించగా.. బిడ్డలను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. బిడ్డలను విక్రయించినందుకు ఈమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాలేజీలో ర్యాగింగ్‌లు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ర్యాగింగ్ బాధను తట్టుకోలేక కొందరు కాలేజీ మానేయడం, చనిపోవడం వంటివి చేస్తుంటారు. ఇలానే ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇటీవల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉంది. ఇక్కడ చదువుతున్న పదో తరగతి విద్యార్థులు జూనియర్స్‌ను ర్యాగింగ్ చేశారు. ఈ క్రమంలో ఆరో తరగతికి చెందిన ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేయగా.. ఆ బాధను తట్టుకోలేక ఎలర్జీ నివారణకు వాడే మందు తాగాడు.

ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు టీచర్‌కు చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. ఆశ్రమంలో ర్యాగింగ్ బాధ తట్టుకోలేక విద్యార్థి ఎన్నోసార్లు వార్డెన్‌కు కూడా చెప్పాడట. అయిన వార్డెన్ కనీసం పట్టించుకోలేదు. కేవలం వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడని అంటున్నారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆ్రమ ప్రిన్సిపల్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: బాలీవుడ్ లో 'పుష్ప2' భీభత్సం.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు